Headlines

Video:పెళ్లికి బంధువులు లేరు.. సోషల్ మీడియాలో పిలిస్తే వేల మంది వచ్చారు!

Man With No Close Family Invites Internet To His Wedding Strangers Turn Up With Food And Gifts

పెళ్లంటేనే బంధుమిత్రుల సందడి.. విందు, వినోదం. జీవితంలో ఒక్కసారి జరిగే వేడుకను ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ చైనాకు చెందిన ఓ యువకుడికి నా అనేవాళ్లు ఎవరూ లేరు. దాంతో తన పెళ్లికి రావాలని సోషల్ మీడియా ద్వారా అపరిచితులను ఆహ్వానించాడు. అయితే స్పందన చూసి ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ఊహించని విధంగా ఎంతో మంది అపరిచితులు అతడి పెళ్లికి వచ్చి వేడుకను వైభవంగా మార్చేశారు.

CHINNAPUDE THALLI MARANAM

యువకుడికి చిన్నప్పుడే తండ్రి మరణించారు. తల్లి మరో పెళ్లి చేసుకోవడంతో సోదరుడితో కలిసి ఒకరికొకరు తోడుగా పెరిగారు.  ఎన్నో కష్టాలను దాటుకుని కొంత డబ్బు పొదుపు చేసి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌ అయ్యాడు యువకుడు. అయితే పెళ్లికి వచ్చి ఆశీర్వదించే బంధువులు లేకపోవడంతో బాధపడ్డాడు. తన పెళ్లి వేడుకలో అతిథుల సందడి లేకుండా పోతుందేమోనని ఆందోళన చెందాడు.

సోషల్ మీడియాలో పెళ్లికి ఆహ్వానం

సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. తనకు ఎవరూ బంధువులు లేరని, తన పెళ్లికి వచ్చి వేడుకను Happyga జరిపించాలని నెటిజన్లను కోరాడు. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజున తనకు తోడుగా ఉండాలని అపరిచితులను ఆహ్వానించాడు. నెటిజన్ల నుంచి ఊహించని స్పందన వచ్చింది. చాలా మంది పెళ్లికి వస్తామని ముందుకొచ్చారు. ఓ వ్యక్తి,  ‘సోదరా.. మేం వస్తున్నాం!’ అంటూ కామెంట్ పెట్టాడు.

Man Inviting Strangers to His Wedding Ended Up Getting A Whole Village Full of Celebration byu/Sapphire-Crystal ininterestingasfuck

అపరిచితులు ఒక్కొక్కరుగా ఇంటికి చేరుకున్నారు. కొందరు పెళ్లి తంతుకు అవసరమైన సరుకులు, బహుమతులు తీసుకొచ్చారు. మరికొందరు వంటకు ఉప్పు నూనెలు ఇతర పదార్థాలను అందించారు. కొంత మంది షెఫ్‌లు డబ్బులు తీసుకోకుండా పెళ్లి విందు వండేందుకు ముందుకొచ్చారు. ఇంకొందరు పెళ్లి కార్లను ఏర్పాటు చేశారు. వధూవరుల కోసం ఒక వ్యక్తి ఏకంగా మేబ్యాక్ (Maybach) కారును అందించాడు. మరికొందరు పెళ్లి కొవ్వొత్తులు తీసుకొచ్చి ఇంటిని అందంగా అలంకరించారు. ఇలా పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ చేతనైన సాయం చేస్తూ వేడుకలో భాగమయ్యారు. బంధువులు లేక పెళ్లి వేడుక వెలవెలబోతుందేమోనని బాధపడిన ఆ యువకుడికి అపరిచితులే ఆత్మీయులుగా మారారు. వారి ప్రేమాభిమానాలతో పెళ్లి వేడుక ఎంతో సందడిగా సాగింది.

నెటిజన్లను కదిలించిన పెళ్లి వీడియో

ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘ప్రపంచంలో మనుషుల్లో స్వార్థం పెరిగిపోతోందని, మానవత్వం తగ్గిపోతోందని కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ ఇలాంటి ఘటనలు చూస్తే మానవత్వంపై మళ్లీ నమ్మకం కలుగుతుంది. మనుషుల్లో మంచితనం ఇంకా బతికే ఉందని అనిపిస్తుంది’ అని కామెంట్‌ చేయడం విశేషం. ఇంతమంది వస్తారని యువకుడు ఊహించి ఉండకపోవచ్చు. అంతమందిని చూసిన ఆ సమయంలో అతనికి కలిగిన ఆనందం వెలకట్టలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.  ఎవరూ లేరని బాధపడిన ఆ యువకుడి పెళ్లిని అపరిచితులంతా కలిసి జీవితాంతం గుర్తుండిపోయే వేడుకలా  మార్చేశారు. రక్తసంబంధం లేకపోయినా ఆప్యాయత, మానవత్వం ఉంటే చాలని ఈ ఘటన మరోసారి నిరూపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *