Headlines

410 కోట్ల ఏళ్ల నాటి అంగారకుడి రాయి.. ఎక్కడ పడిందంటే..

అది చూడటానికి సాధారణ రాతి ముక్కలాగే ఉంది.  కానీ దాని వయస్సెంతో తెలుసా?  410 కోట్ల సంవత్సరాలు.  అత్యంత పురాతనమైన రాయి అంగారక గ్రహం (మార్స్) నుంచి విడిపోయి అంతరిక్షంలో ప్రయాణించి ఆఫ్రికాలోని సహారా ఎడారిలో పడింది.  రాతిని పరిశీలించిన శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపై ఒకప్పుడు నీరు ప్రవహించేదని నిర్థారించారు.

SAHARA ADARILO DORIKINDI

ఈ అరుదైన ఉల్కకు శాస్త్రవేత్తలు ‘టెఘాజా 001’ (Teghaza 001) అని పేరు పెట్టారు. 2022లో ఆఫ్రికాలోని మాలి దేశం సహారా ఎడారిలో ఎనిమిది ముక్కలుగా ఈ ఉల్క లభించింది. వీటిలో అతిపెద్ద ముక్క మనిషి చేతి పిడికిలి పరిమాణంలో ఉంది. అంగారక గ్రహంపై ఏర్పడి అక్కడి నుంచి అంతరిక్షంలోకి దూసుకొచ్చి చివరకు భూమిపై పడిందని తేల్చారు.

410 కోట్ల ఏళ్ల క్రితం అంగారకుడిపై నీరు!

సాధారణంగా గ్రహం లోపలి భాగంలో వేడికి కరిగిన పదార్థాలు చల్లబడి గట్టిపడినప్పుడు ఇలాంటి రాళ్లు ఏర్పడతాయి.  ఈ ఉల్కలో నీరు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 410 కోట్ల సంవత్సరాల క్రితం అంగారకుడి పైపొరలోని నీరు చొచ్చుకెళ్లి, గ్రహం లోపలి వేడికి కరిగిన రాతి పదార్థాలతో కలిసినట్లు ఆధారాలు సూచించాయి.  ఈ ఉల్క అంగారకుడు ఏర్పడుతున్న తొలి దశకు చెందినదిగా నాసా శాస్త్రవేత్త యాంగ్ లియు గుర్తించారు. ఆ సమయంలో మార్స్ ఇప్పటితో పోలిస్తే వెచ్చగా, తేమతో కూడిన Vathavarananni కలిగి ఉండేదని అన్నారు.

RATHI. ముక్క వయస్సును ఎలా గుర్తించారు?

ఉల్కలోని అతి చిన్న జిర్కాన్ (Zircon) స్ఫటికాలను పరిశీలించగా స్ఫటికాల్లో యురేనియం మూలకం కనిపించింది. యురేనియం ఎంత మేరకు సీసంగా మారిందో లెక్కించడం ద్వారా ఆ ఖనిజం ఎప్పుడు ఏర్పడిందో శాస్త్రవేత్తలు అంచనా వేసారు.  టెఘాజా 001 వయసు కనీసం 410 కోట్ల సంవత్సరాలు ఉంటుందని నిర్ధారించారు.

అంగారకుడిపై జీవం ఉండేదా?

ఈ ఉల్కలో నీటి ఆధారాలు లభించడం మరో కీలక ప్రశ్నకు దారితీస్తోంది. అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదా?  జీవం మనుగడ సాగించడానికి నీరు అత్యంత అవసరం. మార్స్‌పై గతంలో నీరు ఉండేది అంటే అక్కడ జీవం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.   అంగారకుడు గ్రహంగా ఏర్పడుతున్న తొలి దశలో జీవం మనుగడకు అనుకూల పరిస్థితులు ఉండేవనీ ఎన్నో మార్పుల అనంతరం ప్రస్తుతం అంగారకుడిపై శీతల వాతావరణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో నదులు ప్రవహించాయని,  సముద్రం కూడా ఉండేదని అన్నారు.

ఉల్కల్లో అతి పురాతనమైంది ఇదే

EPPATHIVARAKU. భూమిపై అంగారకుడి 435 ఉల్కలు పడ్డాయి. వీటిలో కేవలం మూడింటిని గ్రహం తొలి దశకు చెందినవిగా గుర్తించారు.  టెఘాజా 001 వాటన్నింటిలోకి  పురాతనమైంది. అంగారకుడిని భారీ గ్రహశకలం ఢీకొట్టిన సమయంలో ఆ రాయి అక్కడి నుంచి బయటకు ఎగిరి అంతరిక్షంలోకి చేరిందనీ,  అంతరిక్షంలో ప్రయాణించి భూమి వాతావరణంలోకి ప్రవేశించి సహారా ఎడారిలో పడినట్లు తేల్చారు.  పరిశోధనా వివరాలు ప్రముఖ సైన్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. సహారా ఎడారిలో దొరికిన చిన్న రాతి ముక్క అంగారకుడి 410 కోట్ల ఏళ్ల చరిత్రను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలకు అరుదైన అవకాశాన్ని కల్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *