Headlines

MS Dhoni: 21 ఏళ్లుగా చెక్కుచెదరని ధోనీ రికార్డు.. బద్దలు కొట్టలేకపోతున్న ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు

MS Dhoni: 21 ఏళ్లుగా చెక్కుచెదరని ధోనీ రికార్డు.. బద్దలు కొట్టలేకపోతున్న ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి చాలా కాలమే అయినా, అతడి రికార్డులు మాత్రం ఇప్పటికీ ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తున్నాయి. అలాంటి రికార్డుల్లో ఒకటి గత 21 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉంది. 2005 అక్టోబర్ 31న శ్రీలంకతో జరిగిన వన్డేలో ధోనీ ఈ ఘనత సాధించాడు. జైపూర్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ ముందు శ్రీలంక 299 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేజింగ్‌లో ధోనీ అద్భుతంగా ఆడి 145 బంతుల్లో 183 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఈ అద్భుత ప్రదర్శనతో భారత్ లక్ష్యాన్ని సులభంగా అందుకుంది.

వికెట్ కీపర్‌గా అత్యధిక స్కోరు

ఈ ఇన్నింగ్స్‌తో ధోనీ వన్డే క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ వికెట్ కీపర్ బ్యాటర్ కూడా ఈ స్కోరును అధిగమించలేకపోయాడు. దూకుడైన బ్యాటింగ్‌కు పేరుగాంచిన ఎంతోమంది ఆటగాళ్లు ప్రయత్నించినా 183 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. ధోనీ రికార్డుకు దగ్గరగా వచ్చిన ఆటగాళ్లలో సౌతాఫ్రికా మాజీ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ముందున్నాడు. 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో అతడు 178 పరుగులు చేశాడు. 295 పరుగుల లక్ష్య ఛేదనలో 113 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, 11 సిక్సర్లు బాదాడు. అయితే ధోనీ రికార్డుకు మరో 6 runs.  దూరంలోనే అతడి ఇన్నింగ్స్ ముగిసింది.

దగ్గరకు వచ్చిన లిటన్ దాస్

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్ కూడా ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం దక్కించుకున్నాడు. 2020లో జింబాబ్వేతో జరిగిన వన్డేలో అతడు 176 పరుగులతో చెలరేగాడు. అయినా ధోనీ స్కోరును అందుకోలేకపోయాడు. వీరితో పాటు జేఎస్ మల్హోత్రా 173 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 172 పరుగులతో ఈ జాబితాలో ఉన్నాడు. ఇలా పలువురు ఆటగాళ్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడినా ధోనీ 183 పరుగుల రికార్డు మాత్రం అలాగే కొనసాగుతోంది.

గిల్‌క్రిస్ట్ రికార్డును బద్దలు కొట్టిన ధోనీ

ధోనీ కంటే ముందు వన్డేల్లో వికెట్ కీపర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉండేది. 2004లో జింబాబ్వేపై అతడు 172 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2005లో ధోనీ తొలుత పాకిస్థాన్‌పై 148 పరుగులు చేసి గిల్‌క్రిస్ట్ రికార్డుకు చేరువయ్యాడు. అదే ఏడాది శ్రీలంకపై 183 పరుగులతో ఆ రికార్డును అధిగమించాడు. అప్పటి నుంచి వికెట్ కీపర్‌గా వన్డేల్లో అత్యధిక స్కోరు రికార్డు ధోనీ పేరుతోనే konasaguthundi. 21 ఏళ్లు గడిచినా ఈ ఘనతను ఎవరూ అందుకోలేకపోవడం మాహీ ఇన్నింగ్స్ ప్రత్యేకతను మరోసారి గుర్తు చేస్తోంది.

ధోనీ రికార్డు ఎప్పుడు బద్దలవుతుందో?

ప్రస్తుత క్రికెట్‌లో బ్యాటర్లు వేగంగా పరుగులు సాధిస్తున్నా వికెట్ కీపర్‌గా 183 పరుగులు చేయడం అంత సులభం కాదు. క్వింటన్ డికాక్, లిటన్ దాస్ వంటి ఆటగాళ్లు రికార్డుకు చేరువగా వచ్చినా చివరి మెట్టు దాటలేకపోయారు. భవిష్యత్తులో ఏ వికెట్ కీపర్ ఈ రికార్డును బద్దలు కొడతాడనేది ఆసక్తికరంగా మారింది. అప్పటివరకు వన్డేల్లో వికెట్ కీపర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా ధోనీ పేరు చరిత్రలో నిలిచిపోనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *