Headlines

భారత్‌లోకి Honda తొలి ఎలక్ట్రిక్ SUV.. Alpha EV భారీ బ్యాటరీ రేంజ్‌తో లాంచ్​ ఎప్పుడో తెలుసా

Honda గతంలో పరిచయం చేసిన 0 Alpha కాన్సెప్ట్ ఆధారంగా Honda Alpha ప్రొడక్షన్ మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మిడ్‌సైజ్ SUV విభాగంలోకి రానున్న ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లతో Andubatuloki వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా LFP బ్యాటరీ టెక్నాలజీ, భారత్‌లోనే తయారీ, విదేశీ మార్కెట్లకు ఎగుమతి వంటి అంశాలు ఈ SUVపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి Honda Alphaలో ఎలాంటి ప్రత్యేకతలు Undanunnai?

0 Alpha కాన్సెప్ట్ ఆధారంగా కొత్త SUV!

Honda తన ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్‌ను 2025 అక్టోబర్‌లో 0 Alpha పేరుతో పరిచయం చేసింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఆధారంగా ప్రొడక్షన్ మోడల్‌ను రూపొందిస్తోంది. డిసెంబర్ 2న జరిగే ప్రపంచ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ SUV డిజైన్, ఫీచర్లు, ఇతర సాంకేతిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ పూర్తి స్పెసిఫికేషన్లను Prakatinchaledu.

బ్యాటరీ విషయానికి వస్తే Honda Alphaలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉంటాయని కంపెనీ ధృవీకరించింది. ఇవి రెండూ LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) టెక్నాలజీతో రూపొందనున్నాయి. బ్యాటరీ సామర్థ్యం 65kWh నుంచి 75kWh మధ్య ఉండొచ్చని అంచనా. ప్రారంభంలో సింగిల్ మోటార్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది. అయితే కచ్చితమైన బ్యాటరీ సామర్థ్యం, మోటార్ పవర్, టార్క్, డ్రైవింగ్ రేంజ్, ఛార్జింగ్ సమయంపై ఇంకా వివరాలు Velladikaledu.

కొత్త H లోగోతో పరిచయం!

Honda Alpha ఎలక్ట్రిక్ SUVని భారత్‌లోనే తయారు Cheyanunnaru. రాజస్థాన్‌లోని తపుకారా ప్లాంట్ ఈ వాహనానికి ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా పనిచేయనుందని సమాచారం. ఇక్కడ తయారయ్యే SUVలను దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంది. దీనివల్ల భారత ఆటోమొబైల్ తయారీ రంగంలో హోండా కార్యకలాపాలకు ఈ మోడల్ కీలకంగా మారనుంది.

మరోవైపు ఈ SUV పేరును ప్రకటించే సమయంలో Honda India తొలిసారిగా కొత్త ‘H’ లోగోను ఉపయోగించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ఈ కొత్త గుర్తును ఇప్పుడు భారత మార్కెట్లోనూ ఉపయోగించడం Prarambinchindi.

మొత్తంగా Honda Alpha EV భారత ఎలక్ట్రిక్ SUV విభాగంలో కంపెనీకి కీలకమైన మోడల్‌గా నిలవనుంది.December 2న జరిగే ఆవిష్కరణలో దీని పూర్తి ఫీచర్లు, బ్యాటరీ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ధర, డ్రైవింగ్ రేంజ్, ఛార్జింగ్ సామర్థ్యం, Vikreyala ప్రారంభ తేదీపై మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *