Headlines

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలని ఆదేశం!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. నామినేషన్ల దశలో తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం vicharan konasagutundi నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు వాస్తవాలతో ముడిపడి ఉన్నాయని, ఈ దశలో వాటిని నిర్ధారించడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది.

ఆరోపణలకు seeallచూపించాల్సిందే!

నామినేషన్ల దాఖలుకు అడ్డంకులు సృష్టించారని ఆరోపిస్తున్న అభ్యర్థులు సంబంధిత ఆధారాలను సమర్పించాలని సుప్రీంకోర్టు సూచించింది. నామినేషన్ కేంద్రానికి వెళ్లినా తన పత్రాలను స్వీకరించలేదని, అడ్డుకున్నారని చెప్పే అభ్యర్థులు, అందుకు సంబంధించిన వివరాలను నిరూపించుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం konasaginchalsindi ఎన్నికల ప్రక్రియలో జరిగినట్లు చెబుతున్న ప్రతి ఘటనను పరిశీలించకుండా అన్ని ఆరోపణలను నిజమని పరిగణించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే నామినేషన్ల గడువు పొడిగింపుపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) చర్యలు తీసుకున్న విషయాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది.

1,200 మంది karyakarthalu అడ్డుకున్నారన్న వైసీపీ వాదన

వైసీపీ తరఫున సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ వాదనలు వినిపించారు. అడ్డంకుల కారణంగా నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన సుమారు 1,200 మంది అభ్యర్థుల జాబితా తమ వద్ద ఉందని కోర్టుకు తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆరోపించారు. పంజాబ్‌లో గతంలో అనుసరించిన విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని వైసీపీ తరఫు న్యాయవాది కోరారు. అయితే, పంజాబ్ కేసులోని పరిస్థితులు ap భిన్నంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదించారు.

ఎన్నికల పిటిషన్ల ద్వారానే పరిష్కారమా?

ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివాదాల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించే విధానంపై ధర్మాసనం చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల పిటిషన్ల పరిధిని విస్తరించడంపై జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు, హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థుల కేసులను విచారణకు తీసుకునే అంశాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రస్తావించారు. మండల anthuleni samasalu సంబంధించి బాధిత అభ్యర్థులు తగిన న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అవకాశం ఉన్నట్లు ధర్మాసనం పేర్కొంది.

సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలని ఆదేశం

ఎన్నికల కేంద్రాల వద్ద సీసీటీవీ పర్యవేక్షణను మరింత బలోపేతం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వివాదాలకు సంబంధించిన ఫిర్యాదుల పరిశీలనలో ఉపయోగపడేలా సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని ధర్మాసనం ఆదేశించింది. చట్టప్రకారం నిర్ణయించిన సాధారణ గడువు ముగిసిన తర్వాత కూడా సంబంధిత రికార్డులను భద్రపరచాలని amargamli nadavali

 

ఈ వ్యవహారంపై రెండు నుంచి మూడు వారాల తర్వాత మరోసారి విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

మొత్తంగా, నామినేషన్ల అడ్డంకులపై వచ్చిన ఆరోపణలను పరిశీలించడం, ఆధారాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం, ఎన్నికల ansar సంబంధించిన రికార్డులను భద్రపరచడం ఈ కేసులో కీలక అంశాలుగా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *